Sunday, January 15, 2012

ఆ... ముత్యాల ముగ్గుల్లో

పల్లవి :

ఆ... ముత్యాల ముగ్గుల్లో
ఆ... రతనాల గొబ్బిళ్లో
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి


చరణం :

అత్తింట సాగుతున్న
అల్లుళ్ల ఆగడాలు భోగి పళ్లుగా
కంగారు రేపుతున్న
కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా
ఉన్నమాట పైకి చెప్పు
అక్కగారి వైనమేమో సన్నాయిగా
దేనికైన సిద్ధమైన బావగారి
పద్ధతేమో బసవన్నగా
పిల్లపాపలే పచ్చతోరణాలుగా
పాలనవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసి తెరతీసి కనువిందుగా
మనకందిన సిరిసంపదే సంక్రాంతి

మనసును చూసే కన్నులు ఉంటే
పగలే వెన్నెల రాదా
మమతలు పూసే బంధాలుంటే
ఇల్లే కోవెల కాదా
మన అనువాళ్లే నలుగురు ఉంటే
దినము కనుమే కాదా
దేవతలేని దేవుడు నీవు ఇల చేరావు
కనలేని కొనలేని అనురాగమే నువు పంచగా అరుదెంచదా సుఖశాంతి


చిత్రం : పండగ (1998)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : మనో, చిత్ర, బృందం

చంద్రబోస్ పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్. స్వస్థలం వరంగల్ జిల్లాలోని చల్లగరిగ గ్రామం. తాజ్‌మహల్ (1995) చిత్రంలో ‘మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో’ అనే పాట ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు

0 comments:

Post a Comment

songs

Powered by eSnips.com

Sreedhar NGO - RaviChandra Foundation (Srikakulam)

This is the NGO I started for the poor students and the disabled kids in Srikakulam, Andhra Pradesh

NT College Vizag

Email Me: Request a lyric


Your Name
Your Email Address
Subject
Message
Image Verification
captcha
Please enter the text from the image:
[ Refresh Image ] [ What's This? ]

Powered byEMF Contact Form